నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో చేప ప్రసాదం పంపిణీ

-

ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున బత్తిని సోదరులు ఉచితంగా ఈ చేపప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ కార్యక్రమం గత మూడేళ్లుగా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో మూడేళ్ల తర్వాత ఇవాళ హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఇవాళ ఉదయం 8 గంటలకు బత్తిని సోదరుల ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతోందన్నారు.

దశాబ్దాలుగా సాగుతున్న ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని అనేక ప్రాంతాల నుంచి రెండు రోజుల ముందుగానే ప్రజలు నగరానికి చేరుకున్నారు. మూడేళ్ల విరామం తర్వాత చేప ప్రసాదం పంపిణీ మరోమారు చేపడుతున్న నేపథ్యంలో ఎంతమంది వస్తారన్న విషయంలో సరైన స్పష్టత లేకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను పిల్లలను అందుబాటులో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news