భక్తులకు శుభవార్త.. యాదగిరిగుట్టపైకి 5 లిఫ్టులు

యాదాద్రి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం ఐదు లిఫ్టులు అందుబాటులోకి రానున్నాయి. కొండకు ఉత్తరం వైపు ఘాట్ రోడ్డు వద్ద గుట్టకింద నుంచి నేరుగా కొండపైకి భక్తులు వెళ్లేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ఒక్కో లిఫ్టులో 25-30 మంది వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. వీటి ద్వారా నేరుగా క్యూ కాంప్లెక్స్ కు చేరుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడ దుర్గమ్మ ఆలయం, అన్నవరం గుడిలో ఈ తరహా లిఫ్టులు ఉన్నాయి. భక్తుల ఆకర్షించేందుకు, అలాగే, భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.