కేసీఆర్ తెలంగాణ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా రైతుల కోసం.. ఎంతో చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అందులో రైతు బంధు ఒకటి. ఈ పథకం రైతులకు ఎంతో సహాయకంగా ఉంది. అయితే.. నేటితో రైతుబంధు పథకానికి ఐదేళ్లు పూర్తి అయింది.
సరిగ్గా 2019 సంవత్సరంలో.. రైతు బంధు పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్…తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 65 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాలో ఈ పథకం కింద జమా చేశారు. ప్రతీ పంటకు 60 లక్షల లబ్ధిదారులు లబ్ది పొందుతున్నారు. ఈ రైతు బంధు స్కీం కింద ప్రతీ ఏటా మొదట్లో రూ.8 వేలు ఇచ్చేవారు. కానీ రెండేళ్ల నుంచి ఎకరాకు రూ.10 వేలు ఇస్తోంది తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్. ఇక జూన్ లో మరో విడత డబ్బులు పడనున్నాయి.