అట్టర్ ప్లాప్: టెన్త్ ఫలితాలలో… 25 స్కూళ్లల్లో అందరూ ఫెయిల్…

-

కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ర్టానికి చెందిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి విడుదల చేశారు. ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఉత్తీర్ణత 86 .60 శాతం గా వచ్చింది. అంతేకాకుండా 2793 స్కూల్స్ లో పరీక్ష రాసిన మొత్తం విద్యార్థులు పాస్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిలో 1410 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, మిగిలినవి ప్రభుత్వ పాఠశాలలు. కాగా ఇక్కడ ఒక షాకింగ్ విషయం రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా
25 స్కూల్స్ లో కనీసం ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వకపోవడం సంచలనంగా మారింది. అయితే ఈ 25 స్కూల్స్ ఏ జిల్లాలో ఉన్నవి అన్నది తెలియాల్సి ఉంది.

కాగా ఒక్క విద్యార్హ్ది కూడా పాస్ అవ్వకపోవడం అంటే అక్కడ ఆన్న టీచర్స్ ఏమి చేస్తున్నారు ? ఆ జిల్లా విద్యాశాఖాధికారి ఏమిచేస్తున్నారు ? ఇలాంటి ఎన్నో సందేహాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచింపచేస్తున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news