తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పెండ పిసికి, దున్నపోతులు కాసే… తలసాని నా గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు రేవంత్.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో బోర్డ్ సమావేశానికి హాజరైన ఎంపీ రేవంత్ రెడ్డి.. తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పెండ పిసికి, దున్నపోతులను కాసే, పాన్ పరాకులు తినే తలసాని కూడా నా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కేటీఆర్ చెప్పులు మోసిన నాలా అధ్యక్షుడు కాలేడని ఫైర్ అయ్యారు. కేంద్ర సర్వీస్ ఛార్జీలు ఇప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని కోరారు రేవంత్ రెడ్డి.