అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు భూమి కోల్పోవాల్సిందే : సీఎం రేవంత్ రెడ్డి

-

  • అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు భూమి కోల్పోవాల్సిందే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లో రైతు పండుగ ముగింపు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న సమయంలో భూసేకరణ సేకరించకుంటే నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులు పూర్తి అయ్యేవేనా అన్నారు. అప్పుడు కూడా ఇలాగే అడ్డుకొని అధికారులను కొడితే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు కుప్ప కూలిపోయాయని తెలిపారు.

గతంలో ఎంపీ గా ఉండి కెసిఆర్ మహబూబ్నగర్ జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తాము ఏడాది లోపే  25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశామని తెలిపారు. రైతులకు ఉచిత కరెంటు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరి పండిస్తే.. రూ.500 బోనస్ ఇస్తున్నామని.. ఇది చూసి బిఆర్ఎస్ నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version