మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు

-

తెలంగాణ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త అందింది. మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందించేందుకు నిర్ణయం తీసుకుందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు రాబోయే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

For women Rs. Lakh crore interest free loans

అటు ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగినంత విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్ధ్యం అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2031-32 అంచనాల ప్రకారం ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క.. రామగుండం ఎన్టీపీసీ ఫేజ్-2లో 2 వేల 400 మెగావాట్ల ఉత్పత్తికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news