కాంగ్రెస్ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ పిర్యాదు

-

తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 30 ఎన్నికలు కావడంతో ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి బీ ఫామ్స్ కూడా అందజేసింది. అతి తక్కువ మందికి తప్పా దాదాపు అందరికీ బీ ఫామ్స్ అందజేసింది. బీజేపీ త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొంటుంది. కాంగ్రెస్ తొలి విడుతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

కానీ కాంగ్రెస్ లో ఇప్పటికే అసమ్మతి నేతలు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే, మాజీ కాంగ్రెస్ నేత గొనె ప్రకాశ్ పిర్యాదు చేశారు. బలహీన వర్గాలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన 12 మందికి టికెట్ ఇచ్చారు. సర్వే రిపోర్టులు అంటూ రేవంత్ రెడ్డి తన వర్గం వాళ్లకే టిక్కెట్లు ఇచ్చుకున్నాడని మండిపడ్డారు. పార్టీకోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగిందని వెల్లడించారు. మరోవైపు ఐదు సార్లు ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్ రావును ఖమ్మం జిల్లాలో కీలక నేత మాదిరిగా ప్రాజెక్ట్ చేస్తున్నారని తన ఆగ్రహం వ్యక్తం చేశారు గొనె ప్రకాశ్.

Read more RELATED
Recommended to you

Latest news