బీఆర్ఎస్ పార్టీ మారడంపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి క్లారిటీ

-

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నాకు దైవసామానులు కేసిఆర్‌కు చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. పార్టీ మారే ఆలోచన నాకు లేదని వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

Former MLA Marri Janardhan Reddy has denied the media propaganda that I am changing the party

ఇదంతా మీడియా సృష్టించిన గోబెల్స్ ప్రచారం మాత్రమేనని చెప్పారు. నేను ఎప్పుడూ ఎక్కడ ఎవరితో పార్టీ మారతానని ఇప్పటివరకు చెప్పలేదని వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నేను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని తెలిపారు. పార్టీ మారాల్సి వస్తే కేసిఆర్‌కు, నా నియోజకవర్గ ప్రజలకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని వివరించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news