రూ.500కే గ్యాస్ సిలిండర్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.500 కే సిలిండర్ హామీపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ఇంద్రవెల్లి లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల కష్టాలను దృష్టిలో ఉంచుకొని గతంలో రూ.400 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చామని.. ప్రస్తుతం సిలిండర్ ధర 1200 కు పెరిగింది అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల లో భాగంగా త్వరలోనే మహిళలకు 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయని.. సామాన్యులపై భారం పడకుండా అతి త్వరలోనే ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని తెలిపారు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండి పది మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వము.. ప్రజల కోసమే ఏర్పడిన ప్రభుత్వమని తెలిపారు సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news