బీఆర్ఎస్‌కు భారీ షాకిచ్చారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ఈ మేరకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఓదేలు, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. దీంతో చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఉంటారా అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది.
కాగా, 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చెన్నూర్ శాసన సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 13వ ఉమ్మడి ఏపీ శాసనసభ సభ్యుడిగా గెలుపొందాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో 2010 ఫిబ్రవరి 14న తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన ఓదేలు 2010 జులై 30న జరిగిన ఉపఎన్నికలో తిరిగి ఎన్నికయ్యాడు. 2014లో చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ పై విజయం సాధించాడు. తెలంగాణ చీఫ్ విప్ గా కూడా నియమితులయ్యాడు ఓదెలు.