ధ్రువస్త్ర, సుఖోయ్‌.. రూ.45వేల కోట్ల ఆయుధ వ్యవస్థల డీల్​కు రక్షణశాఖ గ్రీన్​సిగ్నల్​!

-

దేశ భద్రతా దళాలను మరింత బలోపేతం చేసేందుకు భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.45వేల కోట్లతో ఆయుధాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా స్వదేశీ మంత్రాన్నే జపిస్తున్న ఇండియా.. స్వదేశీ సంస్థల నుంచే ఈ కొనుగోళ్లు చేపట్టనుంది. ఈ రూ.45వేల కోట్ల డీల్​లో 12 సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానాలు, ధ్రువాస్త్ర క్షిపణుల సమీకరణ, డోర్నియర్‌ విమానాల ఆధునికీకరణ వంటివి ఉన్నాయి. భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి (డీఏసీ).. మొత్తం తొమ్మిది ప్రతిపాదనలకు శుక్రవారం ఆమోదం తెలిపింది.

డీఏసీ ఆమోదం తెలిపిన ప్రతిపాదనలు ఇవే

  • నౌకాదళం కోసం సర్వే నౌకలు.
  • శతఘ్నులు, రాడార్లను వేగంగా తరలించడానికి, మోహరించడానికి హై మొబిలిటీ వెహికల్‌, గన్‌ టోయింగ్‌ వాహనాలు.
  • హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సామగ్రితో రూపొందించే 12 సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానాలు.
  • తేలికపాటి సాయుధ బహుళ ప్రయోజన వాహనాలు (ఎల్‌ఏఎంవీ), సమీకృత నిఘా, లక్ష్య వ్యవస్థ (ఐఎస్‌ఏటీ-ఎస్‌).
  • దేశీయంగా నిర్మించిన ఏఎల్‌హెచ్‌ ఎంకే-4 హెలికాప్టర్ల కోసం స్వదేశీ ధ్రువాస్త్ర స్వల్పశ్రేణి క్షిపణులు.

Read more RELATED
Recommended to you

Latest news