BRS కు మరో షాక్ తగులనుంది. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్.. వెళ్లేందుకు సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది. BRSకి గుడ్ బై చెప్పే ఆలోచనలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్.. ఉన్నట్లు తెలుస్తోంది.
అనుమానాలకు బలం చేకూర్చేలా వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టారు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలతో దిగిన ఫోటోలను వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు ఫారూఖ్ హుస్సేన్. BRS లో ఎమ్మెల్సీ పదవి ముగియడంతో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.