తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఏకంగా 495 కోట్ల రూపాయల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి కేటీఆర్. మీర్ ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటెన్ ను కూడా ప్రారంభించారు. అలాగే ఎస్ టి పీ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఎనిమిది వేల నుంచి 17 వేల రూపాయలకు పెంచినట్లు గుర్తు చేశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వంలోని హైదరాబాద్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. నగరవాసుల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే 108 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తిచేసిన బహదూర్ పూర్ ఫ్లైఓవర్, 35 కోట్లతో చార్మినార్ వద్ద మోగి చౌక్ పునరుద్ధరణ, 30 కోట్లతో సర్దార్ మలాల్ అభివృద్ధి, 297 కోట్ల రూపాయలతో కార్వాన్ నియోజకవర్గం లో సివరేజ్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్.