Salaar: డేంజర్ ఎహెడ్..KGF2ని మించి ‘సలార్’..ప్రభాస్ షూటింగ్ పిక్స్ వైరల్

-

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF2 సినిమాతో భారతీయ సినిమా స్థాయిని ఇంకా పెంచాడని చెప్పొచ్చు. RRR పిక్చర్ తో రాజమౌళి విజ్యువల్ వండర్ క్రియేట్ చేసి ప్రతీ ఒక్కరు గర్వించే సినిమా తీయగా, అంతే స్థాయిలో ప్రశాంత్ నీల్ కష్టపడి కేజీఎఫ్ చాప్టర్ టూ తీశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీపైన ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.

కేజీఎఫ్ 2 సెట్స్ మీద ఉండగానే, తన నెక్స్ట్ మూవీని ప్రభాస్ తో అనౌన్స్ చేశారు ప్రశాంత్. తెలంగాణలోని రామగుండం, గోదావరి ఖని ప్రాంతాల్లో ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు ‘సలార్’ మూవీ యూనిట్ సభ్యులు. నెక్స్ట్ లెవల్ మేకింగ్ ఈ సినిమాలో ఉండబోతున్నదని ఈ సందర్భంగా మేకర్స్ అంటున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను మాస్ ఇమేజ్ లో నెక్స్ట్ లెవల్ ఎలివేషన్స్ ఉండబోతున్నాయని చెప్తున్నారు. కాగా, తాజాగా ‘సలార్’ షూటింగ్ స్పాట్ ఫొటోలు లీక్ అయ్యాయి. వాటిని ట్విట్టర్ లో ఓ యూజర్  ‘డేంజర్ ఎ హెడ్’ అనే క్యాప్షన్ తో షేర్ చేయగా, అవి నెట్టింట వైరలవుతున్నాయి. సదరు ఫొటోను చూసి ప్రభాస్ అభిమానులు ఆనంద పడుతున్నారు.

KGF2ని మించిన మసాలా ఈ చిత్రంలో ఉండబోతున్నదని స్టిల్ చూస్తుంటే అర్థమవుతున్నదని అంటున్నారు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల విడుదలై అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలోనే ‘సలార్’ ఫిల్మ్ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అవుతుందని అంటున్నారు ప్రభాస్ అశేష అభిమానులు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news