రేపు హైదరాబాద్ లో కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన..15 వేల మందికి ఉపాధి !

-

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ హైదరాబాద్ లో తమ కొత్త క్యాంపస్ ను రేపు (ఈనెల14న) శంకుస్థాపన చేయనుంది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్ తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది.

Foundation stone laying for Cognizant’s new campus in Hyderabad tomorrow

ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్​ చేస్తుంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని ఈ నెల 14వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అదేరోజు కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపనలో పాల్గొంటారు. కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ కూడా హాజరవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news