కేటీఆర్.. మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి : ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

-

మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బస్సుల్లో అల్లం, వెల్లిపాయాలు గిల్లుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అంటున్నారు. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్కకి కనబడడం లేదా? బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్స్‌లు వేసుకోమనండి.. మాకేంటి’’ అని అన్నారు.

కేటీఆర్ మహిళలు బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ లు వేసుకోమనడం సిగ్గు చేట్టు అని పలువురు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి స్పందిస్తూ.. కేటీఆర్ వ్యాఖ్యల వల్ల యావత్ తెలంగాణ మహిళా లోకం బాధ పడుతుంది. సాటి మహిళగా కేటీఆర్ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. ఆడవారి గురించి ఇంకోసారి మాట్లాడే ముందు జాగ్రత్తగా అలోచించి మాట్లాడాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news