ఫాక్స్‌కాన్ పరిశ్రమకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్ అనంతరం మాట్లాడారు. ఫాక్స్ కాన్ తెలంగాణకు ఐకాన్ గా నిలవనుందని.. దేశంలో అతి పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్ కాన్ హైద్రాబాద్ కు రావడం సంతోషం అని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్ లో ఫాక్స్ కాన్ తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
ఫాక్స్ కాన్ రాకతో.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ అని.. తొమ్మిది ఏళ్లుగా తెలంగాణ శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు 50 బిలియన్ పెట్టుబడులు తెలంగాణ సాధించిందని.. ముప్పై ఏళ్లలో చైనా సాధించిన అభివృద్ధి రాబోయే ఇరవై ఏళ్లలో తెలంగాణ సాధించ బోతుందన్నారు. రాబోయే పదేళ్లలో 1.5 బిలియన్ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని.. గత మార్చ్ లో ఒప్పంద చేసుకుని .. ఇప్పుడు భూమి పూజ నిర్వహించుకున్నామని వివరించారు. వచ్చే మార్చిలో ఉత్త్పత్తులు ప్రారంభమవుతాయి.. యువతకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.