ఉప్పల్‌లో భారత్‌-ఇంగ్లాండ్ టెస్ట్‌ మ్యాచ్‌కు వారికి ఉచిత ప్రవేశం

-

హైదరాబాద్ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు భారత్‌-ఇంగ్లాండు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హెచ్‌సీఏ, రాచకొండ పోలీసులు సమన్వయంతో భద్రత, పార్కింగ్‌, మిగతా ఏర్పాట్లలో బిజీ అయ్యారు. మరోవైపు ఈ మ్యాచ్కు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఆర్మీ, నేవీ అధికారులకు ఉచిత ప్రవేశం కల్పించాలని హెచ్సీఏ నిర్ణయించినట్లు సమాచారం.

ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం లభించనుంది. రోజుకు 5వేల మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. వారికి ఉచితంగానే భోజనం కూడా ఉంటుందట. మరోవైపు జవనరి 26న రిపబ్లిక్‌ డేను పురస్కరించుకొని ఆర్మీ, నేవీ అధికారులకు టెస్ట్‌ మ్యాచ్‌ను ఉచితంగానే చూపించనున్నట్లు సమాచారం.

ఇక ఈ మ్యాచ్కు సంబంధించి ఈనెల 18 నుంచే టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టికెట్‌ ధరలు రూ.200 నుంచి రూ.4వేల వరకు ఉన్నాయి. వీటిలో కూడా 5 రోజులకు ప్యాకేజీ రూపంలో తక్కువ ధరకే ఇస్తున్నారు. టికెట్లను జింఖానా మైదానంతో పాటు ఇన్‌సైడర్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లోనూ, పేటీఎం, పేటీఎంఇన్‌సైడర్‌ మొబైల్‌ యాప్‌లో లభిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news