‘ఉచిత విద్యుత్‌’ పొందాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే

-

రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని తెలిపింది. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ పొందే అర్హుల ఎంపికకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.

ఉచిత విద్యుత్ మార్గదర్శాలు ఇవే.. 

  • ఫ్రీ కరెంట్ లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు.
  • ప్రజాపాలనలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్‌కార్డు, ఆధార్‌, కరెంటు కనెక్షన్‌ నంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపికవుతారు.
  • అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్‌ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు.
  • ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీకల్లా ప్రభుత్వం రాయితీ పద్దు కింద డిస్కంలకు విడుదల చేస్తుంది.
  • ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల.. ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్‌ చట్టం కింద, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద కేసు నమోదవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news