తిరుమల భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. దీంతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 08 గంటల సమయం పట్టింది. అటు 63, 421 మంది భక్తులు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 19, 644 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
దీంతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4. 84 కోట్లుగా నమోదు అయింది. కాగా TTD రమణ దీక్షితులుకు బిగ్ షాక్ తగిలింది. TTD నుంచి రమణ దీక్షితులును తొలగించారు.తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది TTD పాలకమండలి. TTD, అహోబిల మఠం, జియ్యంగార్లు,అర్చకులపై రమణ దీక్షితులు అనుచిత వాఖ్యలు చేసారని…..క్రమశిక్షణా రాహిత్యంతో వ్యవహరించిన రమణ దీక్షితులును టీటీడీ నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి.