తెలంగాణ ఆర్టీసీ ని తిరిగి లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎండీగా మాజీ ఐపీఎస్ సజ్జనర్ బాధ్యతలు తీసుకున్న అప్పటి నుంచి.. అనేక మార్పులతో తెలంగాణ ఆర్టీసీ దూసుకుపోతోంది. ప్రయాణికులకు.. ఆర్టీసీ సర్వీసు దగ్గర చేసేందుకు అనేక ప్రణాళికలు రచిస్తోంది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం.
ఇప్పటికే చాలా ఆఫర్ లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది ఆర్టీసీ. ఇక తాజాగా ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. సుదూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులో నగరానికి చేరుకునే ప్రయాణికులు తిరిగి సిటీ బస్సుల్లో ఉచితంగా ఇంటికి చేరుకునేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
250 కిలోమీటర్లు పైగా ఆర్టీసీ బస్సుల్లో నగరానికి చేరుకున్న ప్రయాణికులు మొదటి రెండు గంటల లోపు సిటీ బస్సులో నగరవ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా వెళ్లేందుకు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకోండి. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ ఆఫర్ ను అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.
250 KM ల పై ఉన్న దూర ప్రాంతాలకు ముందస్తు #TSRTCTicket రిజెర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ ఇంటి వద్ద నుండి #TSRTCBus ఎక్కు ప్రాంతం వరకు సిటీలో ఉచితంగా ప్రయాణించవచ్చు. #Hyderabad జంటనగరాలలో ప్రయాణానికి 2 గంటలు ముందు, మరియు ప్రయాణం తర్వాత 2 గంటలు వర్తించును. #TSRTCFreeBusTravel pic.twitter.com/YIZLPcIH8Y
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 2, 2022