అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న 30 మంది రైతులు..!

-

సాధారణంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారంటే పోలీసులు వారిని పట్టుకొని అరెస్ట్ చేస్తుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలీసులు లంచాలు తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

పోలీసులకు చెప్పి చెప్పి విసిగిపోయి స్వయంగా అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు 30 మంది రైతులు. ప్రజా పాలన పేరుతో జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలంలోని పులిమామిడి, కుమ్మరి కుంట, కేకే కాలువ శివారులోని రైతుల పొలాలలో బోర్లను పైపులైన్ ధ్వంసం చేసి ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. గ్రామంలోని రైతులు గత రెండు నెలలుగా సంబంధిత పోలీస్, మైనింగ్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ  ఫలితం లేకుండా పోయింది. దీంతో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 30 మంది రైతులు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని హాలియా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news