ఇక నుంచి ప్రతీ పల్లెటూరికి ఒక వైన్స్ తీసుకువచ్చేలా.. సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాలు పెంచేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం… వరుస ఎన్నికలు ఉండడంతో ముందస్తు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసిందట. ప్రతీ జిల్లాలోని మేజర్ పంచాయితీలకే పరిమితమైన వైన్స్ షాపులను ప్రతీ గ్రామానికి విస్తరించాలని నిర్ణయించిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

వరుసగా ఎన్నికలు ఉండడంతో ముందుగానే నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల వారికి కూడా అవకాశం కల్పించేలా కొత్త పాలసీ రూపొందించాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మండల పరిధిలో తక్కువ అమ్మకాలు ఉన్న వైన్స్ షాపులను గుర్తించి వాటిని గ్రామ స్థాయికి మార్చాలని నిర్ణయించిదట. ఏ4 దుకాణాలకు ప్రస్తుతం 2 ఏండ్లు ఉన్న లైసెన్స్ గడువును 3 ఏండ్లకు పెంచేలాగా, దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచి ఆదాయం రెట్టింపు చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేయనుందట ఎక్సైజ్ శాఖ.