హైదరాబాద్ మహానగరంలో గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో గెలిచిన గులాబీ పార్టీ నేతలు… కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్.. పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.
అలాగే ఆయనకు ఇచ్చిన పదవులను కూడా… తిరస్కరించారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. ఈ మేరకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాజీనామా లేఖను పంపించడం జరిగింది. గులాబీ పార్టీకి రాజీనామా చేసిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో చేరుతారు అనే దానిపైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు.