తెలంగాణ అలాగే ఏపీ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాల్టి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. ముఖ్యంగా…. హైదరాబాద్, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్ లాంటి ఉమ్మడి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ.
ఇక తెలంగాణలోని మిగతా జిల్లాలకు కూడా వర్షాలు ఉంటాయని వాటికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇటు ఏపీలో… ఉత్తర ప్రాంతంలో ఉన్న జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. విశాఖపట్నం విజయనగరం, శ్రీకాకుళం అల్లూరి, తూర్పుగోదావరి, రాజమండ్రి లాంటి ప్రాంతాలలో.. మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతాలలో ఇవాళ విద్యా సంస్థలకు హాలిడే కూడా ప్రకటించడం జరిగింది.