ప్రజా యుద్ధనౌక, జన ఉద్యమగళం గద్దర్ నిన్న మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గద్దర్ భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచారు. గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రములకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, సినీ రంగానికి చెందిన పలువురు తరలివచ్చి.. నివాళులర్పిస్తున్నారు. ఇక ఇవాళ అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గద్దర్ మృతికి సంతాపం ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.