సెల్ ఫోన్లు దొంగిలిస్తున్న ముఠా గుట్టు రట్టు.. 30 మంది అరెస్ట్

-

ప్రస్తతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ లేనిది బయటికి వెళ్లారు. మొబైల్ ఫోన్ అందుబాటలోకి వచ్చాక అందరూ వినియోగిస్తున్నారు. ఏ సమాచారాన్ని అయినా మొబైల్ లోనే చేరవేస్తున్నారు. నిత్యవసర వస్తువుగా మొబైల్ మారింది. అయితే అలాంటి మొబైల్ ఫోన్లను కొందరూ కేటుగాళ్లు దొంగిలిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ నగరంలో మొబైల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ముఖ్యంగా 30 మంది ఓ గ్యాంగ్ గా ఏర్పడి నిత్యం నగరంలో ఎక్కడో ఒక చోట సెల్ ఫోన్లు దొంగిలిస్తూ మొబైల్ ఫోన్లను సొమ్ము చేసుకుంటున్నారు. బాధితుల సమాచారం సేకరించిన హైదరాబాద్ పోలీసులు గ్యాంగ్ ను పక్కా పథకం ప్రకారం.. అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి సుమారు రూ.2కోట్ల విలువ చేసే 713 మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news