నేడు తెలంగాణలో ‘జై ఎన్టీఆర్’ వెబ్​సైట్ లాంచ్

-

హైదరాబాద్​లోని కైత్లాపూర్‌ మైదానంలో ఇవాళ ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల కోసం 10 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9గంటల వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. చంద్రబాబు తోపాటు నందమూరి బాలకృష్ణ హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మురళీమోహన్‌, డి.రాజా, సీతారాం ఏచూరి, పురందేశ్వరి, విక్టరీ వెంకటేశ్‌, ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రానా, సుమన్‌, జయప్రద, కె. రాఘవేంద్రరావు పాల్కొననున్నారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్‌ జీవితచరిత్రపై ముద్రించిన ప్రత్యేక సంచిక, జై ఎన్టీఆర్​ వెబ్‌సైట్‌లు ఆవిష్కరించనున్నారు.

తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నట్లు మురళీ మోహన్ తెలిపారు. ఈ కార్య్రక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ తారలు హాజరవ్వనున్నారని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీ లోపు నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డును బహూకరించాలని ప్రధానమంత్రిని ఇదే వేదిక నుంచి డిమాండ్ చేయబోతున్నామని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version