అగ్ని ప్రమాదాలపై జీహెచ్ఎంసీ, హైడ్రా సంయుక్త సర్వే

-

వేసవిలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, హైడ్రా దృష్టి సారించాయి. ఈ ప్రమాదాల హాట్ స్పాట్లను గుర్తించేందుకు సంయుక్తంగా సర్వే చేయాలని నిర్ణయించారు. గ్రేటర్లో ఉన్న వాణిజ్య, నివాస భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణ ప్రమాణాలను కఠినంగా అమలు చేయడానికి చర్యలు ప్రారంభించారు. భవన యజమానులు, నిర్వాహకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో అవసరమైన నివారణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

అగ్ని ప్రమాదాలు సంభవించడానికి అనుకూలంగా ఉండే హాట్ స్పాట్ లపై అధికారులు సర్వే చేయనున్నారు. నివాసిత అపార్ట్మెంట్ లు, వాణిజ్య భవనాలలో భవన లేఅవుట్ ప్లాన్, ఫైర్ సేఫ్టి ప్లాన్, ఫైర్ ఎన్వోసీ తదితర అంశాలను విస్తృత స్థాయిలో తనిఖీ చేసి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతోపాటు గత రెండేళ్లలో ఏఏ ఏరియాలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంశాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. దీంతోపాటు జనావాసాల్లో ఉన్న టింబర్ డిపోలు, స్క్రాప్ గోదాంలను, టైర్ షాపులను గుర్తించి ఆ ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news