గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. ఓవైపు రాష్ట్రంలో కురుస్తున్న ఏకధాటి వర్షాలు.. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం గోదావరి 48 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. బుధవారం మధ్యాహ్నం 44 అడుగులు ఉండగా.. రాత్రి వరకు 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
పరిసర ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నందున ఇంకా గోదావరిలో ఇంకా ప్రవాహం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఇప్పటికే ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. అన్నదాన సంత్రంలోకి వాన నీరు వచ్చింది. వరద నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. గంటలు గడిచే కొద్ది గోదావరి నదిలో ప్రవాహం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.