భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

-

ఒక్క రోజు గ్యాప్ ఇచ్చిన వరణుడు మళ్లీ ముసురుపట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ముసురు పట్టింది. చిరుజల్లులతో రాష్ట్రమంతా చల్లగా మారిపోయింది. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో పలు ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద బుధవారం రోజున కాస్త శాంతించిన గోదావరి మళ్లీ పుంజుకుంటోంది. క్రమంగా అక్కడ నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. గురువారం (ఇవాళ) ఉదయం 9 గంటలకు భద్రాచలం వద్ద 47.3 అడుగుల నీటిమట్టం ఉంది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం నుంచి నిన్నటి వరకు తగ్గిన నీటి మట్టం తగ్గిన విషయం తెలిసిందే.

మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 850 క్యూసెక్కుల వరద చేరుతోంది. పూర్తి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,388.32 అడుగుల వద్దకు నీరు చేరింది. ఇక ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 17.80 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 3.41 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద పోటెత్తుతుండటంతో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news