మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలో ఉన్న జగన్ తిరుగు ప్రయాణం అయ్యారు. తాడేపల్లికి వచ్చేస్తున్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. వాస్తవానికి ఇవాళ కేంద్ర పెద్దలతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం కావాల్సి ఉంది.

Prime Minister,
Appointment of the President
కానీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు కేంద్రం. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. దీంతో ఢిల్లీలో ఉన్న జగన్ తిరుగు ప్రయాణం అయ్యారు. తాడేపల్లికి వచ్చేస్తున్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఇక అటు చంపేస్తే.. నన్ను చంపేయండి అంటూ మాజీ సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. చంపేస్తే.. నన్ను చంపేయండి కానీ టీడీపీకి ఓటు వేయని ప్రజలను, వైసీపీ కార్యకర్తలను కాదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ హింసకు ఆయన వారసుడు నారా లోకేష్, చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.