సాధారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రజల వద్ద నేరుగా డీలర్లు బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి వారు దళారులకు అధిక ధరకు అమ్ముతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది పట్టుపడినప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ అదే డీలర్లు కంటిన్యూ అవుతున్నారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. సివిల్ సప్లై కార్పొరేషన్ 55 వేల కోట్ల అప్పుల్లో ఉందని.. ధాన్యం కొనుగోళ్ల టెండర్లలో గోల్ మాల్ జరిగిందన్నారు. టన్నుకు రూ.2 ,230 ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఈ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. పెద్ద స్కామ్ జరిగింది. ప్రభుత్వం లో ఉన్న పెద్దలకు చీమకు కట్టినట్టు కూడా లేదు. మిల్లర్ల దగ్గర 70 లక్షల మెట్రిక్ టన్ను ల వడ్లు ఉన్నాయి. గోదాం లు ఖాళీగా లేవు.. ఇప్పుడు వచ్చే వడ్లను ఎక్కడ పెడతారు. ఇది రైతులకు సంబంధించిన సమస్య అర్హత లేని రైస్ మిల్లర్లకు, బ్లాక్ లిస్ట్ లో ఉన్న రైస్ మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తున్నారు. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందన్నారు. దీనిపై సీబీఐ విచారణను అప్పగించాలని డిమాండ్ చేశారు.