హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ త్వరలోనే ఆర్డినెన్స్ – రంగనాథ్

-

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ని జీవో నెంబర్ 99 ద్వారా జూలై 19న ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా చట్టబద్ధతను కొందరు ప్రశ్నిస్తున్నారని.. హైడ్రా చట్టబద్ధమైనదేనని రంగనాథ్ స్పష్టం చేశారు.

కార్యనిర్వాహక తీర్మానంతోనే సంస్థ ఏర్పాటు జరిగిందన్నారు. హైడ్రా చట్టబద్ధతపై ప్రభుత్వం పని చేస్తుందని, వచ్చే నెల రోజుల్లో గా ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలతో ఆర్డినెన్స్ విడుదల చేస్తారని తెలిపారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ రానుందన్నారు.

అలాగే విశేష అధికారాలు కూడా రాబోతున్నాయన్నారు. ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని.. గ్రేహౌండ్స్, టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని వివరించారు. మున్సిపాలిటీలు, నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని తెలిపారు రంగనాథ్.

Read more RELATED
Recommended to you

Latest news