తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా మహమూద్ అలీ కొనసాగారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖను ఎవ్వరికీ ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టి ప్రతీ రోజూ డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాాజాగా శంషాబాద్‌లోని రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. విమానాల్లో దుబాయి నుంచి వ్యక్తిన నలుగురి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు మహిళల వద్ద 1865.2 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న బంగారం రూ.1.18కోట్ల విలువ ఉంటుందని పేర్కొన్నారు. 16 బంగారు బిస్కెట్లను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి నుంచి 1,100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ చెప్పింది. ఈ బంగారం విలువ రూ.69.85లక్షలు ఉంటుందని చెప్పింది. ఈ నెల 30న మహిళ నుంచి 1,632 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని దాని విలువ రూ.1.03కోట్ల ఉంటుందని కస్టమ్స్ వివరించింది.