పాలమూరులో ప్రధాని రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రజల కోరికను నెరవేర్చారు. ప్రధానంగా పాలమూరు లో ప్రధాని మోడీ వరాల జల్లులు కురిపించారు. ప్రధానంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రిమోట్ తో రైల్వేలను, జాతీయ రహదారులను ప్రారంభించారు మోడీ. కొన్నింటికి శంకుస్థాపనలు కూడా చేశారు. తెలంగాణ బోర్డుకు పసుపు బోర్డు ప్రకటించారు ప్రధాని మోడీ. తెలంగాణలో పసుపు విస్తృతంగా పండుతుందని.. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రధాని మోడీ.
తెలంగాణకు పసుపు బోర్డును ప్రకటించారు. కరోనా తరువాత పసుపునకు డిమాండ్ బాగా పెరిగిందని తెలిపారు ప్రధాని మోడీ. పాలమూరు సభ సాక్షిగా పలు వరాలను కురిపించారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎమినేన్స్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మార్చారు.ములుగు జిల్లాలో సమ్మక్క-సారక్క పేరుతో రూ.900 కోట్లతో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీంతో గిరిజనులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. మరోవైపు తెలంగాణ ప్రజల మనస్సులో ఉన్నదే మాట్లాడుతానని చెప్పారు. పాలమూరు ప్రజాగర్ఝన సభలో ప్రధాని ఏం మాట్లాడబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.