పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని ఏం చెప్పబోతున్నారు ?

-

మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పర్యటన. రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్. వరంగల్‌-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు.

నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ. దేశంలో పండగల సీజన్‌ నడుస్తోంది. పార్లమెంట్‌లో నారీశక్తి బిల్లును ఆమోదించుకున్నాం. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. రవాణా సదుపాయాలు మెరుగవుతాయని తెలిపారు. పదే పదే నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో మాట్లాడిన ప్రధాని మోడీ. నేడు అనేక రోడ్‌ కనెక్టివీటీ ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించుకున్నాం. రోడ్డు ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయన్నారు.

పసుపు బోర్డుపై ప్రధాని మోడీ కీలక ప్రకటన. తెలంగాణకు పసుపు బోర్డు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. పాలమూరు సభ సాక్షిగా ప్రకటించారు ప్రధాని. ములుగు జిల్లాకు సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ. సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ. బహిరంగ సభకి ముందే మాట్లాడిన సందర్భంలో మోడీ ఓ టీజర్ వదిలారు. లిక్కర్ స్కామ్ గురించి చెబుతారా..? తెలంగాణకు ఏమేమి చేశారనేది చెప్పనున్నారు. తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించడానికి మోడీ ఏం మాట్లాడుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news