భూమి లేని పేదలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి లేని ప్రతీ కుటుంబానికి రూ.12 వేలు ఇస్తామని.. రెండు విడుతలుగా రూ.12వేలు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కేబినెట్ లో ఈనెల 28న భూమి లేని వారికి రూ.6వేలు ఇవ్వాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

అదేవిధంగా 5 ఆర్డినెన్స్ లకు ఆమోదం తెలిపింది. ముక్యంగా పంచాయతీ రాజ్ సవరణ చట్టం, ఆర్వోఆర్ చట్టం పై సుదీర్ఘంగా చర్చించారు. ఓఆర్ఆర్ పరిధిలో 51 గ్రామపంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనానికి ఆమోదం తెలిపారు. తెలుంగాణ వస్తు సేవల పన్ను, జీతాలు పెన్షన్ల పెంపు, పురపాలక సంఘాల సవరణ తదితర బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సంక్రాంతి పండుగ తరువాత రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు.