తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఉద్యోగుల వేతన సవరణ కమిషన్(PRC)తో పాటు మధ్యంతర భృతిని ప్రకటిస్తామని, EHS పక్కాగా అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో KCR హామీ ఇచ్చారు. 2వ PRCని ఏర్పాటు చేసి, 2023 జూలై 1 నుంచి అమలయ్యేలా IRను ప్రకటించాలని ఉద్యోగులు కోరగా… సీఎం సానుకూలంగా స్పందించారు.
ఇవాళ లేదా రేపు అసెంబ్లీలో పిఆర్సి కమిషన్, మద్యంతర భృతిపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక అటు సింగరేణి కార్మికులకు తీపికబురు అందింది. మే 19న జరిగిన 11వ వేతన సవరణ ఒప్పందాన్ని యాజమాన్యం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 23 నెలల బకాయిలు ఈ నెల వేతనంతో కలిపి సెప్టెంబర్ లో చెల్లించని ఉందని సమాచారం. 19% మినిమం గ్యారంటీ బెనిఫిట్, 25% అలవెన్స్ లను చెల్లించనుందట. దీంతో ఫస్ట్ కేటగిరి కార్మికుడికి రూ. 12 వేల వరకు జీతం పెరగనుంది. దీనిపై సింగరేణి యాజమాన్యం త్వరలో ప్రకటన చేయనుందని వార్తలు వస్తున్నాయి.