యాసంగి ధాన్యాన్ని బహిరంగ వేలంలో విక్రయించాలనే యోచనలో సర్కార్

-

రాష్ట్రంలో గడిచిన రెండు సీజన్లకు సంబంధించి కోటి టన్నులకుపైగా ధాన్యం నిల్వలున్నాయని రాష్ట్ర సర్కార్ తెలిపింది. మరో రెండు నెలల్లో వానాకాలం పంటతో మరో కోటి టన్నులకుపైగా ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఉన్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్థలం లేదని.. మరోవైపు మర ఆడటంలో జాప్యంతో మరికొన్ని నిల్వలు బయటే మగ్గుతున్నాయని.. ఇంకోవైపు నాణ్యత లేదంటూ ఎఫ్​సీఐ బియ్యాన్ని నిరాకరిస్తోందని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న యాసంగి ధాన్యాన్ని ఎలాగైనా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం బహిరంగ వేలం నిర్వహించాలని యోచన చేసింది.

పెరుగుతున్న ధాన్యం నిల్వలు, స్థలాభావ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదికను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ నివేదికపై సమీక్షించి వారం రోజుల్లో ప్రభుత్వం ధాన్యం వేలంపై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎంత ధాన్యం విక్రయించాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని.. ఒకే దఫా వేలం వేయాలా? విడతలుగానా అనే అంశంపైనా సర్కారు నుంచి వారం రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని’ సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news