నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

-

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వము శుభవార్త చెప్పింది. 5089 టీచర్ పోస్టుల భర్తికీ అనుమతించింది ప్రభుత్వం. ఈ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎప్పటినుంచో నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నప్పటికీ ఎట్టకేలకు తాజాగా ప్రభుత్వము పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించింది.

ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టుల్లో 2575 పోస్టులు SGT, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను, 611 భాషా పండితులు..164 పీఈటీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వము అనుమతించింది. ఇటీవల విద్యాశాఖ మంత్రి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలోనే ప్రభుత్వము 5089 పోస్టుల భర్తీ చేసేందుకు అనుమతించడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎప్పటినుంచో టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మోకాల్లో కాస్త సంతోషము కనిపిస్తోంది. ఎలాగైనా ఈసారి ఉద్యోగం సాధించాలనే కసితో ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి డీఎస్సీలో ఎవరు ఉంటారు అనే విషయాలను పాఠశాల విద్యాశాఖ తుది ఉత్తర్వులను త్వరలోనే ఇవ్వనుంది. గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించడంతో జాప్యం జరిగిందనే నెపంతో ఈసారి డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ)  పరీక్షలను నిర్వహిస్తుందని సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news