డ్రైవర్లకు TSRTC అదిరిపోయే శుభవార్త..

-

డ్రైవర్లకు TSRTC అదిరిపోయే శుభవార్త చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. తెలంగాణ రాష్ట్రంలోని డ్రైవ్లర్లను ఘనంగా సన్మానిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవరన్నలది క్రియాశీల పాత్ర ఉందని చెప్పారు. వారి సేఫ్ డ్రైవింగ్ వల్లే టీఎస్ఆర్టీసీ పయ్యాలు సాఫీగా నడుస్తున్నాయని వెల్లడించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.

Good news for TSRTC drivers

నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయన్నారు. నిబద్ధత, క్రమ శిక్షణతో పాటు ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ.. #TSRTC ని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న డ్రైవరన్నలకు.. డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. డ్రైవర్స్ డే సందర్బంగా #TSRTC ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల పరిధిలో ఉన్న డ్రైవ్లర్లను ఘనంగా సన్మానిస్తోందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.

Read more RELATED
Recommended to you

Latest news