సీఎం కేసీఆర్‌ గారు.. ఉగాది కి రావాలి : తెలంగాణ గవర్నర్‌…

-

నా ఆహ్వానాన్ని కేసీఆర్‌ స్వీకరిస్తారని భావిస్తున్నా.. కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాన్ని ఆకాంక్షిద్దాం.. ముఖ్యమంత్రి చాలా కాలంగా రాజ్‌భవన్‌కు రావడం లేదు. గ్యాప్‌కి నా వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవు. నేను అత్యంత బలమైన వ్యక్తిని.. నన్ను కట్టడి చేయలేరు. ప్రభుత్వం చేసే ప్రతి సిఫారసు ఆమోదించాలని లేదు. నా మంచితనాన్ని వాడుకోవడాన్ని అంగీకరించను.రాజ్‌భవన్‌ రాజకీయాలకు కేంద్రమైందనడం సరికాదు.బడ్జెట్‌ సమావేశాల్లో నా ప్రసంగాన్ని సర్కారు రద్దు చేసింది. ఓ ప్రముఖ టీవీ ఇంటర్వ్యూలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేసారు.

 

 

 

‘రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార, విపక్ష పార్టీల నేతలు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నా. ఇది నా మర్యాద. నా ఆహ్వానాన్ని అందరూ స్నేహపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నా..’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. ‘ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పాత విషయాలను మరిచి కొత్త ఆరంభాన్ని మనమందరం ఆకాంక్షిద్దాం. విభేదాలన్నీ కనుమరుగు కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి చాలా కాలం నుంచి రాజ్‌భవన్‌కు రావడం లేదు. ఈ గ్యాప్‌కి నా వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవు. నేను ఏ సమస్యనూ సృష్టించాలని కోరుకోను. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నానని గవర్నర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news