జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నాలు..!

-

కొత్త ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో కొలువుల జాతర కొనసాగుతోందని, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు భరోసాగా నిలబడిందని, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీలు, రిజర్వేషన్ల వివాదాలు, ఫలితాలు నిలిపివేతలు, కోర్టు కేసులు నిరుద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయని, దాదాపు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్న గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రెండు సార్లు రద్దు చేసిందని గుర్తు చేశారు.

గత పాలక వర్గాన్ని తప్పించి కొత్త ఛైర్మన్ ను, బోర్డు సభ్యులను నియమించిందని, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణను కూడా కట్టుదిట్టం చేసిందని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఢిల్లీకి వెళ్లి యూపీఎస్ సీ చైర్మన్ ను కలిసి జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయంలో వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలో ప్రధాన అడ్డంకిగా మారిన కోర్టు కేసుల చిక్కుముడులన్నింటినీ ఒక్కటొక్కటిగా కొత్త ప్రభుత్వం అధిగమించిందని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మొత్తం 28,942 మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించిందని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news