టీఎస్పీఎస్ చైర్మన్ అలానే ఇతర సభ్యులు డిసెంబర్లో రాజీనామాలు చేసాక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్. అలానే లీగల్ ఒపీనియన్ కూడా గవర్నర్ తీసుకోవడం జరిగింది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ అలానే ఇతర వాటి పై సమగ్ర విచారణ చెయ్యాలని గవర్నర్ సూచించారు. భాద్యులైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ప్రభుత్వానికి చెప్పారు.
అలానే నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వారి రాజీనామాలను ఆమోదించి కొత్త చైర్మన్, సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వీరి రాజీనామాలను ఆమోదించడానికి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం లేఖ ని పంపింది. వీటి పై వెంటనే స్పందించారు. వారి రాజీనామాలను ఈ రోజు గవర్నర్ ఆమోదించారు.