చంద్రబాబు కేసుల్లో ఇవాళ బిగ్ డే..బెయిల్ వస్తుందా!

-

చంద్రబాబు కేసుల్లో ఇవాళ బిగ్ డే.. చంద్రబాబుకు సంబంధించిన కేసుల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుపై ఆయన వేసిన క్వాష్ పిటిషన్ నేడు సుప్రీంలో విచారణకు రానుంది. చంద్రబాబు అరెస్టయి నెల రోజులైన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి సుప్రీం ఆదేశాలపైనే ఉంది.

Chandrababu in jail until the end of November
Chandrababu in jail until the end of November

ఇక IRR, అంగర్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ పిటిషన్ లపై హైకోర్టు తీర్పులు ఇవ్వనుండగా…..బెయిల్, కస్టడీ పిటిషన్ పై ACB కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. అయితే.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు… నవంబర్ చివరి వరకు జైల్లోనే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 17A చెల్లుబాటుపై సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ పై నవంబర్ 20న సుప్రీం తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పటివరకు బాబు లాయర్ల 17A వాదనను పరిగణలోకి తీసుకోవద్దని ఇవాళ సుప్రీంను కోరుతుందని YCP శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news