తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానం ఖాళీ ఏర్పడింది. మే 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి ఆయా పార్టీలు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ సార్ మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకుంటూ నేటి వరకు ప్రచారం నిర్వహించారు. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూన్ 05న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉండగా.. పోలింగ్ ఎంత శాతం జరుగుతుందో.. విజయం ఎవ్వరూ సాధిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.