గ్రూపు-1 పరీక్షలు ఆగవు.. సీఎం సంచలన ప్రకటన

-

గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాలయాపనకు పుల్ స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు.  563 పోస్టులకు తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటి సారి జరుగుతున్న ఎగ్సామ్స్ ఇవి.. 31వేల మంది మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసినట్టు తెలిపారు. 

పరీక్షలకు సిద్ధం కండి. ఇప్పటికే 95 శాతం మంది అభ్యర్థు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. మరో 5 శాతం మంది డౌన్ లోడ్ చేసుకోండి. ప్రతిపక్షాల మాయమాటలను అస్సలు నమ్మకండి. గత ప్రభుత్వం పదేళ్లలో ఉద్యోగ నియమాకాలు చేపట్టలేదు. మేము వచ్చాక వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆందోళన చేస్తున్న గ్రూపు-1 అభ్యర్థుల పై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను సీఎం రేవంత్ ఆదేశించారు. కొందరూ అభ్యర్థులు భావోద్వేగంతో ఉన్నారు. వాళ్లపై లాఠీ ఛార్జీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ల పై కేసులు పెడితే పోటీ పరీక్షల్లో రాణించినా ఉద్యోగులకు అనర్హులు అవుతారు. వీళ్లు గ్రూపు-1 పరీక్షలో పాస్ అయితే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. అభ్యర్థులపై మానవత్వంతో వ్యవహరించాలని పోలీసులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news