గ్రూపు-1 హాల్ టికెట్లు విడుదల

-

తెలంగాణ గ్రూపు 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రాయడం.. అది వాయిదా పడటంతో నిరుద్యోగులు కాస్త ఆందోళన చెందారు. పేపర్ లీకేజ్, బయోమెట్రిక్ విధానం పాటించకపోవడం వంటి కారణాలతో గ్రూపు 1 పరీక్ష వాయిదా పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్తగా కొన్ని పోస్టులను యాడ్ చేసి మళ్లీ యధావిధిగా నోటిఫికేషన్ జారీ చేసింది.

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లను అభ్యర్థులు WWW.tspsc.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయి డౌన్ లోడ్ చేసుకొవచ్చని తెలిపింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గత నోటిఫికేషన్ ను రద్దు చేసి.. మరికొన్ని  పోస్టులు  యాడ్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 563 పోస్టుల కోసం దాదాపు 4.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news